ఎస్పీడబ్ల్యూలో విద్యార్థి సంఘం ఎన్నిక
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థి సంఘాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం కళాశాలలో విద్యార్థి సంఘం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రన్సిపల్ డాక్టర్ ఎన్.భీమన్న అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2025- 26 విద్యా సంవత్సరంలో జరిగిన పరీక్షా ఫలితాల్లో 97.4% ఉత్తీర్ణత సాధించారన్నారు. మార్కుల ఆధారంగా విద్యార్థి సంఘ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. విద్యార్థి సంఘ ప్రెసిడెంట్గా జె సానియా శర్మ, అకడమిక్ విద్యలో ప్రతిభ చూపి మంచి మార్కులు సాధించిన వారిని పలు విద్యార్థి సంఘాల నేతలుగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఆచార్యులు గార్లపాటి దామోదర నాయుడు, స్విమ్స్ వైద్యనిపుణులు డాక్టర్ వనజాక్షమ్మ, వైస్ ప్రిన్సిపల్ కే. సాయికుమారి, స్టూడెంట్ కౌన్సిల్ ఇంచార్జ్ డాక్టర్ ఎస్ జయశ్రీ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్