BREAKING
బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం గోవింద నామస్మరణతో మార్మోగిన ఎస్.రాయవరం! మాకవరపాలెం జడ్పీటీసీగా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం క్రీడల్లో పాల్గొనడం వలన మంచి డైరెక్టర్ వ్యాయామం, అభినందించిన ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య ఎ. పల్లవి పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల! గెడ్డపాలెంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటిన పీవీఆర్! కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య.. హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా! కొరుప్రోలు జడ్పీ హైస్కూల్లో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు! ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద పెద్దేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాలకు శ్రీకారం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలి 38వ వార్డులో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు.

మేయర్ అభ్యర్థి సహా ప్రతి డివిజన్లోనూ కూటమి అభ్యర్థులు గెలుపొందాలి

Select Suryaa Now
మేయర్ అభ్యర్థి సహా ప్రతి డివిజన్లోనూ కూటమి అభ్యర్థులు గెలుపొందాలి

 

-- కూటమి ఐక్యతతో అభివృద్ధి పథంలో రాష్ట్రం

-- శ్రీకాకుళం కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరాలి

-- గత ఐదేళ్లలో స్థానిక సంస్థలు నిర్వీర్యం

-- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

మేజర్ న్యూస్-శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమన్వయంతో ముందుకు సాగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.  శ్రీకాకుళంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, మేయర్ అభ్యర్థి దానేటి  రాధారాణి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్పొరేటర్ అభ్యర్థులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, మేయర్ సహా కూటమి అభ్యర్థులందరూ గెలుపొంది శ్రీకాకుళం కార్పొరేషన్ కార్యాలయంపై కూటమి జెండా ఎగురవేయాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ ఐక్యత భావంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానిక సంస్థలకు అత్యంత ప్రాధాన్యత ఉందని, స్థానిక సంస్థలు పటిష్టంగా ఉంటేనే అభివృద్ధి వేగవంతం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని, కేంద్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సంఘం నిధులను సైతం పక్కదారి పట్టించిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.
శ్రీకాకుళం నగరపాలక సంస్థకు గత 16 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకపోవడం వెనుక అప్పటి పాలకుల వైఫల్యం అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు.  కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా, 59 డివిజన్లలో కూటమి అభ్యర్థుల ఎంపికను పరస్పర సమన్వయంతో పూర్తి చేశామని, మేయర్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున శ్రీమతి దానేటి రాధారాణిని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు మంత్రి పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటులో సహకరించిన వారందరికీ తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. గత రెండున్నర సంవత్సరాలుగా నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని మంత్రి సూచించారు.అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మేయర్, కార్పొరేటర్ అభ్యర్థుల మధ్య సమన్వయం ఉండాలని, కూటమి భాగస్వామ్య పార్టీలకు కేటాయించిన గుర్తులపై ఓటర్లకు స్పష్టమైన అవగాహన కల్పించాలని అన్నారు.
ప్రతి డివిజన్‌లోని పరిస్థితులను బట్టి ప్రణాళిక రూపొందించుకుని సమన్వయంతో పనిచేయాలని సూచించారు.కులాల ప్రాతిపదికన రాజకీయాలు చేయడం వల్ల సమాజానికి ప్రయోజనం ఉండదని, కూటమి ఐక్యత, అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన అంశాలుగా ప్రజల్లోకి వెళ్లాలని స్పష్టం చేశారు.