BREAKING
బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం గోవింద నామస్మరణతో మార్మోగిన ఎస్.రాయవరం! మాకవరపాలెం జడ్పీటీసీగా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం క్రీడల్లో పాల్గొనడం వలన మంచి డైరెక్టర్ వ్యాయామం, అభినందించిన ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య ఎ. పల్లవి పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల! గెడ్డపాలెంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటిన పీవీఆర్! కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య.. హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా! కొరుప్రోలు జడ్పీ హైస్కూల్లో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు! ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద పెద్దేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాలకు శ్రీకారం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలి 38వ వార్డులో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు.

వాకర్స్ ఆరోగ్య పరిరక్షణకు కిమ్స్ ఉచిత వైద్య శిబిరం....

Select Suryaa Now
వాకర్స్ ఆరోగ్య పరిరక్షణకు కిమ్స్ ఉచిత వైద్య శిబిరం....

వాకర్స్ ఆరోగ్య పరిరక్షణకు కిమ్స్ ఉచిత వైద్య శిబిరం....
ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా వైద్య సేవలు....         కిమ్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ చైతన్య రాజు....
అమలాపురం మేజర్ న్యూస్ ప్రజల్లో ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంపొందించడంతో పాటు, నిత్యం నడకను అలవాటుగా చేసుకున్న వాకర్స్‌కు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడ్ యునైటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఎస్‌కేబీఆర్ కళాశాల గ్రౌండ్స్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం 6 గంటలకు కిమ్స్ ఫౌండర్ అండ్ చైర్మన్, చైతన్య గ్రూప్ అధినేత కె.వి.వి. సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య పరిరక్షణకు నిత్య వ్యాయామం, నడక ఎంతో అవసరమని, రోజుకు కనీసం 30 నిమిషాల పాటు నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు దోహదపడుతుందని తెలిపారు. మానసిక ఒత్తిడిని తగ్గించడంలోనూ నడక కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ శిబిరంలో కిమ్స్, మెడ్ యునైటెడ్ వైద్య బృందాలు వాకర్స్‌కు రక్తంలో చక్కెర స్థాయిల పరీక్షలు, బీపీ, ఈసీజీతో పాటు పలు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహించాయి. జనరల్ ఫిజీషియన్లు, కార్డియాలజీ వైద్యులు అందుబాటులో ఉండి అవసరమైన వైద్య సలహాలు, ఆరోగ్య సూచనలు అందించారు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఇటువంటి వైద్య సేవలను అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జవ్వాది తాతబాబు, డాక్టర్ వై.వి. నరసింహారావు, శిష్టా శర్మ, మున్సిపల్ కౌన్సిలర్లు గొవ్వాల రాజేష్, గంటి వి.ఎల్.ఎన్.శర్మ (అబ్బీస్), మోకా వెంకట సుబ్బారావు, పలువురు వాకర్స్ పాల్గొన్నారు.                       రంబాల సత్యనారాయణ్అ మలాపురం