BREAKING
15 వ వార్డు అభివృద్ధి దిశగా కృషి - కార్పొరేటర్ ఒమ్మి అప్పలరాజు అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా మోటూరు నాగమణి, వైస్ చైర్ పర్సన్ గా పెంటకోట స్వాతి ఏకగ్రీవ ఎన్నిక మండల అభివృద్ధే నా లక్ష్యం. శ్రీనివాస్ క్షేత్రంలో లక్ష తులసి దళాల పూజపూజ వాకర్స్ ఆరోగ్య పరిరక్షణకు కిమ్స్ ఉచిత వైద్య శిబిరం.... పుస్తక పఠనంతో మానసిక వికాసం -భవిష్యత్తు నిర్మాణంలో గ్రంథాలయాలది కీలక పాత్ర -గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో డీఈఓ శివకుమార్ జడ్పీ చైర్‌పర్సన్‌గా కొరికాన భవాని ప్రమాణ స్వీకారం మెల్లకన్నును గుర్తించండి - చిన్నారులకు అండగా నిలవండి - ఎల్ వి ప్రసాద్ హాస్పిటల్ వైద్య నిపుణులు మేయర్ అభ్యర్థి సహా ప్రతి డివిజన్లోనూ కూటమి అభ్యర్థులు గెలుపొందాలి సైకిల్ గుర్తుకి ఓటు వేయండి ఎస్పీడబ్ల్యూలో విద్యార్థి సంఘం ఎన్నిక ఘనంగా ఏకాహోమ పూజలు - భక్తి పారవశ్యంలో పలాస. ఆమదాలవలస వైస్ ఎంపీపీగా వండాన శ్రీదేవి పలాస కు అరుదైన గౌరవం. కోటబొమ్మాళి జడ్పీటీసీగా పూజారి శైలజ ప్రమాణస్వీకారం

రేడియల్ రోడ్డు పనుల్లో చెట్ల తొలగింపునకు అటవీ శాఖ అనుమతి తప్పనిసరి:పరిగి ఎఫ్‌ఆర్‌ఓ ప్రతిమ

Select Suryaa Now
రేడియల్ రోడ్డు పనుల్లో చెట్ల తొలగింపునకు అటవీ శాఖ అనుమతి తప్పనిసరి:పరిగి ఎఫ్‌ఆర్‌ఓ ప్రతిమ

దోమ, మేజర్ న్యూస్: పరిగి నియోజకవర్గంలో చేపడుతున్న రేడియల్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించాలంటే తప్పనిసరిగా అటవీ శాఖ అనుమతి పొందాలని పరిగి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌ఓ) ప్రతిమ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ప్రకటన విడుదల చేశారు. అనుమతులు లేకుండా పట్టా భూములు, ప్రైవేటు స్థలాలు, ప్రభుత్వ భూములు లేదా అటవీ భూముల్లో ఎక్కడైనా చెట్లను నరికివేయడం అటవీ చట్టాల ప్రకారం నేరమని పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ పనులు చేపట్టే క్రమంలో సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు, భూముల యజమానులు అటవీ శాఖ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమంగా చెట్లను తొలగించినట్లు గుర్తిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని ఆమె హెచ్చరించారు.