పుస్తక పఠనంతో విజ్ఞానం మీ సొంతం
పాలమూరు యూనివర్సిటీ,మేజర్ న్యూస్ -
.పాలమూరు యూనివర్సిటీ లో పలు పుస్తకాల సేకరణ మరియు ప్రదర్శన నిర్వహించారు.వీసీ జి ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ , విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలని, పుస్తకాలు విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు కొత్త ఆలోచనలకు ప్రేరణనిస్తాయని అన్నారు. వివిధ రంగాలకు సంబంధించిన పుస్తకాలను చదవడం ద్వారా విద్యార్థులు తమ పరిజ్ఞానాన్ని విస్తరించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. రమేష్ బాబు, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, లైబ్రరీ కోఆర్డినేటర్ డాక్టర్ వి. జయ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎం.ఓం ప్రకాష్ పాలమూరు యూనివర్సిటీ .మహబూబ్ నగర్