BREAKING
ఓటు వేయడానికి వచ్చిన లచ్చుమయ్య సంతబొమ్మాళిలో ప్రశాంతంగా పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్. ఓటు వినియోగించుకున్న బోయిన కౌంటింగ్ రోజున పలాసలో ట్రాఫిక్ ఆంక్షలు - ఆ మార్గంలో నో ఎంట్రీ. రంజీ ట్రోఫీలో చెలరేగిన మహమ్మద్ షమీ: 8 మెయిడిన్ ఓవర్లతో నాలుగు వికెట్లు పడగొట్టి సెలక్టర్లకు సవాల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుడిని ఆదుకోండి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక కోటబొమ్మాళిలో ప్రశాంతంగా స్థానిక పోరు విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సుల పంపిణీ ఆరు మండలాల్లో ZPTC, MPTC ఎన్నికల పోలింగ్ రేపటికి వాయిదా ఇందిరమ్మ ఇళ్లకు ఉపాధి హామీ గండం ఇంటి తాళం పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాల చోరీ రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలి - జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాదయాత్ర విజయోత్సవం.. సమీక్ష.. ఆత్మీయ సమ్మేళ్లనం..! -వేడుకలో పాల్గొన్న గీతా మూర్తి.

విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సుల పంపిణీ

Select Suryaa Now
            విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సుల పంపిణీ


సూర్య రాజన్న సిరిసిల్ల ;;సిరిసిల్ల పట్టణంలోని తారకరామనగర్ మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు దాతల సహకారంతో స్పోర్ట్స్ డ్రెస్ లను ఎంఈఓ దూస రఘుపతి చేతుల మీదుగా పంపిణీ చేశారు.తారకరామ నగర్ మండల ప్రాథమిక పాఠశాల 160 మంది విద్యార్థులకు దాతల సహకారంతో స్పోర్ట్స్ డ్రెస్ లను వితరణగా అందించగా వాటిని ఎంఈఓ రఘుపతి చేతుల మీదుగా గురువారం విద్యార్థులకు అందించారు. కళ్యాణపు సుభాష్,మండల సత్యం,మంచే మల్లయ్య,బండారి అశోక్,బూట్ల సతీష్, జక్కని దామోదర్ దాతల సహకారంతో స్పోర్ట్స్ డ్రెస్సులను సమకూర్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం దాతలు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని చదువులో ముందుకు సాగితే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని అన్నారు.మంచిగా చదువుకొని తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గంగరాజు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ మోతిలాల్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ బైరి సంధ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఐరేని భారతి,ఉపాధ్యాయ బృందం లత,జ్యోతి, నాగలక్ష్మి,శారద,స్థానికులు పిసుక శ్రీనివాస్, గడ్డం వెంకటేశం,తల్లిదండ్రులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.