BREAKING
కోనసీమలో విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూం నంబర్లు విడుదల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం తెరుచుకోనున్న బ్యాలెట్ బాక్సులు.. నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనున్న వేళ.. గోపాలపురంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ మిసెస్ హైదరాబాద్ కిరీటం కైవసం చేసుకున్న పి.గన్నవరం యువతి రాజశ్రీ రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి విద్యాభివృద్ధికి వుండవిల్లి సేవలు చిరస్మరణీయం తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ నేతల సమావేశం విశాఖ కోర్టు సంచలన తీర్పు నేటి పంచాంగం 7 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –7 నవంబర్, 2026 కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష.. సూపర్వైజర్లతో ఆర్‌ఓ, ఎంపీడీఓ సమావేశం. కడియం కంచుకోటపై ఎవరి జెండా? బుచ్చయ్య చౌదరి అభివృద్ధి వ్యూహం ఫలించేనా? పెరవలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లో 71.77 శాతం పోలింగ్ నమోదు

రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలి - జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Select Suryaa Now
రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలి  - జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
సూర్య, వేములవాడ:వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
వేములవాడ పట్టణంలో వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (వీటీఏడీఏ) ఆద్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం, బద్ది పోచమ్మ ఆలయం, 80 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ఇప్పటి వరకు పూర్తి చేసిన పనులపై ఆరా తీశారు. 
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి, బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణ పనుల్లో భాగంగా ప్రతి పనికి సంబంధించి కూలీల సంఖ్య పెంచాలని, పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఆర్ అండ్ బీ అధికారులు అభివృద్ధి పనులను పరిశీలిస్తూ.. వేగంగా పూర్తి చేసేలా పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. 
రాజన్న ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు 80 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి.. మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. 
పరిశీలనలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, ఆర్ అండ్ బీ ఈఈ భీమ్లానాయక్, మున్సిపల్ కమిషనర్ లోకేష్, ఆర్ అండ్ బీ డీఈ శాంతయ్య, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.