నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటాం
ప్రత్యామ్నాయ వసతి కల్పించకుండా గుడిసెలు తొలగించొద్దు: మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి, మేజర్ న్యూస్ : నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటాం. ప్రత్యామ్నాయ వసతి కల్పించకుండా గుడిసెలు తొలగించొద్దు: మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఓల్డ్ ఎంఐజీ ప్రధాన రహదారి సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన నివసిస్తున్న నిరుపేదల గుడిసెలను రైల్వే అధికారులు, ఆర్‌పీఎఫ్ పోలీసులు జేసీబీలతో తొలగించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాజీ కౌన్సిలర్ మోహన్‌గౌడ్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని అధికారులతో చర్చలు జరిపారు.ప్రత్యామ్నాయ వసతి కల్పించకుండా నిరుపేద కుటుంబాలను రోడ్డున పడేయడం సరికాదని, గుడిసెలు తొలగించవద్దని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని, వారికి న్యాయం జరిగే వరకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మధుసూదన్‌రెడ్డి, రవీందర్‌గౌడ్, శ్రీకాంత్ దేవులపల్లి, మహేందర్ సింగ్, కార్యకర్తలు, బాధిత కుటుంబాలు పాల్గొన్నారు.