BREAKING
నల్గొండ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పవన్ సాయి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్.. ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలి! రోడ్డు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం.. ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలసి పరామర్శించిన కట్టంగూర్ కాంగ్రెస్ నాయకులు! నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం

ఓటర్ల తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ! 69.21 శాతం ఓటింగ్ నమోదు

Select Suryaa Now
ఓటర్ల తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ! 69.21 శాతం ఓటింగ్ నమోదు

గోకవరం, మేజర్ న్యూస్ : తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.  మండలంలో మొత్తం 69.21 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 61 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 39,834 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, వారిలో 19,807 మంది పురుషులు, 20,027 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.  ఉదయం నుంచే పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి, ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారు. మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. పోలీసు సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. మండల వ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు, గొడవలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు. మొత్తం మీద గోకవరం మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ 69.21 శాతంతో ముగిసింది. బ్యాలెట్ బాక్స్ లను భద్రంగా స్ట్రాంగ్ రూములకు తరలించారు. ఓటర్ల తీర్పుపై మండలంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.