BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ

Select Suryaa Now
కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణాజిల్లా, మేజర్ న్యూస్ : రెండవ సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా జిల్లాలో నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ శనివారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి ఓట్ల లెక్కింపు తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, కౌంటింగ్ సిబ్బంది విధుల నిర్వహణ, వివిధ టేబుళ్ల వద్ద చేపట్టిన ఏర్పాట్లు, ఎన్నికల నిబంధనల అమలు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అవనిగడ్డలోని డిగ్రీ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. మొవ్వ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి లెక్కింపు తీరును పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రతి దశలోనూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఘంటసాలలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి, అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో నిబంధనల ప్రకారం ప్రతి దశను నిర్వహించాలని, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఉయ్యూరులోని వీఆర్కేఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. అధికారులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. అనంతరం ధనేకుల ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి కౌంటింగ్ నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, ప్రతి రౌండ్‌లో లెక్కింపు వివరాలను సక్రమంగా నమోదు చేయాలని, ఫలితాల ప్రకటనలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, క్రమశిక్షణ, అవసరమైన మౌలిక సదుపాయాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి కౌంటింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలోని వివిధ కౌంటింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.