BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

Select Suryaa Now
సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి


                                                  చిట్యాల, మేజర్ న్యూస్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కుసుమ్ పథకం లో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని భూపాల్ పల్లి విద్యుత్ శాఖ ఎస్ ఈ సదానందం  ఆన్నారు. మండలంలోని గిద్దెముత్తారం గ్రామంలో పి ఎం కుసుమ్ పథకంలో అల్లం సుజాత రెండు మెగా వాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. శనివారం సోలార్ పవర్ ప్లాంట్ ను గ్రిడ్ కు ఎస్ ఇ సదానందం అనుసంధానం చేశారు. ఈ సందర్భంగా ఎస్ ఈ సదానందం మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్ నీనో ప్రభావం వలన కరెంటు ఉత్పత్తి వాడకం ఎక్కువగా ఉందని చెప్పారు. రైతులకు, వినియోగదాలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు విద్యుత్ శాఖ కృషి చేస్తుందని అన్నారు. సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి ఆసక్తి గల వారు ముందుకు వచ్చి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. సోలార్ పవర్ ప్లాంట్ల వలన సౌర విద్యుత్తు ఉత్పత్తి ద్వారా వాతావరణ కాలుష్యం తగ్గి పర్యావరణాన్ని రక్షిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఇ పాపిరెడ్డి, ఏఈ చంద్రశేఖర్ విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టర్ ;సదానందం, చిట్యాల ,జయశంకర్ భూపాలపల్లి