BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన

Select Suryaa Now
బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన

విజయవాడ కార్పొరేషన్ మేజర్ న్యూస్ : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు బెంజ్ సర్కిల్ సమీపంలోని ఈనాడు గ్రౌండ్స్‌లో బాణసంచా దుకాణదారులకు అగ్నిప్రమాద నివారణ చర్యలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీజీ ఫైర్ సర్వీసెస్ పి.వి. రమణ, అడిషనల్ డైరెక్టర్ ఫైర్ సర్వీసెస్ జి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో రీజినల్ ఫైర్ ఆఫీసర్ సిహెచ్. రత్నబాబు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాణసంచా దుకాణాల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన తీరుపై వ్యాపారులకు అవగాహన కల్పించారు. ప్రతి బాణసంచా దుకాణానికి కనీసం మూడు మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలని, ప్రతి దుకాణంలో నీటితో నింపిన డ్రమ్ములు, ఇసుక బకెట్లు, అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ భద్రతా పరికరాలను ఏర్పాటు చేసుకున్న తర్వాతే దుకాణాల్లో వ్యాపార నిర్వహణకు అనుమతి కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రీజినల్ ఫైర్ ఆఫీసర్ సిహెచ్. రత్నబాబు మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఈనాడు గ్రౌండ్స్, సితార గ్రౌండ్స్, మాకినేని బసవపున్నయ్య స్టేడియం వద్ద మూడు ప్రాంతాల్లో బాణసంచా దుకాణాల ఏర్పాటుకు అనుమతులు కల్పించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని దుకాణాల్లో అగ్నిమాపక పరికరాల లభ్యతను పరిశీలించడంతో పాటు, అగ్నిప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర చర్యలపై వ్యాపారులకు శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. దీపావళి సందర్భంగా ప్రజలు బాణసంచా కొనుగోలు, వినియోగ సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించి ప్రమాదాలు జరగకుండా సహకరించాలని కోరారు. ప్రతి బాణసంచా విక్రయ ప్రాంతంలో జిల్లా అగ్నిమాపక శాఖ సమన్వయంతో ఒక అగ్నిమాపక వాహనాన్ని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ మాల్యాద్రి, ఎస్ఎఫ్ఓ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.