BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు

Select Suryaa Now
కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు

మచిలీపట్నం మేజర్ న్యూస్ : కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా శనివారం జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు వి. అభిషేక్ మచిలీపట్నం నగర పరిధిలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సందర్శించి కౌంటింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణా విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని మచిలీపట్నం ఉత్తర, దక్షిణ మండలాలతో పాటు పెడన నియోజకవర్గ పరిధిలోని పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు తీరును పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలోని వివిధ టేబుళ్ల వద్ద జరుగుతున్న ఓట్ల లెక్కింపు విధానాన్ని, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా నిర్వహించేలా తీసుకున్న చర్యలను సమీక్షించారు. ఈ పర్యటనలో ఎన్నికల సాధారణ పరిశీలకుడి వెంట బందరు ఆర్డీవో కే. సాంబశివరావు, బందరు డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు, తహసీల్దార్ హరనాథ్, ఇతర ఎన్నికల అధికారులు ఉన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం నియోజకవర్గం, కృష్ణాజిల్లా.