జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక
విజయవాడ మేజర్ న్యూస్ : స్థానిక పటమట హైస్కూల్ రోడ్డులోని నారాయణ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని నివేదిక జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీకి ఎంపికై ప్రతిభ చాటుకుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 జాతీయ చిత్రలేఖన పోటీలో ఒలింపియాడ్ విభాగంలో నివేదిక ఎంపికైంది. చదువుతో పాటు సృజనాత్మక రంగాల్లోనూ నారాయణ విద్యార్థులు రాణిస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్. వెంకట రమణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో పాఠశాల ఏజీఎం బి. ముత్తారెడ్డి, కోఆర్డినేటర్ షేక్ హుస్సేన్, ప్రధానోపాధ్యాయురాలు ఎస్.వెంకటరమణ, అకడమిక్ డీన్ఎ స్.మానిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని నివేదికను అభినందించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.