BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

Select Suryaa Now
జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

భూపాలపల్లి సూర్యప్రతినిధి, మేజర్ న్యూస్, జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్  రాహుల్ శర్మ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని అధిక శబ్దం, వాయు కాలుష్యానికి కారణమయ్యే టపాసులకు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు, పెద్దలు తప్పనిసరిగా పర్యవేక్షించాలని, తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలకు తావులేకుండా చూసుకోవాలని తెలిపారు.
దీపావళి పర్వదినం జిల్లా ప్రజలందరి ఇళ్లలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

రిపోర్టర్ ,రవీందర్, భూపాలపల్లి ప్రతినిధి, భూపాలపల్లి జిల్లా