యువత ఆలోచనలే వికసిత్ భారత్ కు పునాదులు
ములుగు, మేజర్ న్యూస్, ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యువ సంవాద్ – వికసిత్ భారత్ 2047 కార్యక్రమం ఘనంగా జరిగింది. ములుగు జిల్లా భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షులు మాదరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సిరికొండ బలరాం విచ్చేసి విద్యార్థులు, యువతను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువత పాత్ర, దేశ అభివృద్ధిలో యువత బాధ్యత, నూతన ఆవిష్కరణలు, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి, ఆత్మనిర్భర్ భారత్ వంటి కీలక అంశాలపై యువతతో చర్చించారు.
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో నేటి యువతే రేపటి నాయకులని, దేశ నిర్మాణంలో ప్రతి యువకుడు క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భూక్యా జవహర్ లాల్, జిల్లా ఉపాధ్యక్షులు జీనుకల కృష్ణాకర్, ములుగు మండల అధ్యక్షులు రాయంచ్ నాగరాజ్, ములుగు పట్టణ అధ్యక్షులు ఇమ్మడి రాకేష్ యాదవ్, భారతీయ జనతా యువ మోర్చా పట్టణ అధ్యక్షులు లావుడ్యా నవీన్ నాయక్, వెంకటాపూర్ భారతీయ జనతా యువ మోర్చా మండల అధ్యక్షులు సోనాసింగ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
యువతను సంఘటితం చేస్తూ, దేశ నిర్మాణంలో భాగస్వాములను చేస్తూ, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధన దిశగా భారతీయ జనతా యువ మోర్చా ములుగు జిల్లా నిరంతరం ముందుకు సాగుతుంది.
రిపోర్టర్; రమేష్ ,ములుగు, ములుగు జిల్లా