మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆర్థిక సహాయం
రాయపర్తి, మేజర్ న్యూస్ , మండలంలోని కేశపురం గ్రామంలో గ్రామ ఉపసర్పంచ్ చెదలు బిక్షపతి తండ్రి చెదలు సోమయ్య, జింకురాం తండా గ్రామ సర్పంచ్ గుగులోత్ సునీత శ్రీను నాయక్ వదిన కవిత,తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్రబోయిన ముత్తయ్య ఇటీవల అనారోగ్యాలతో మరణించగా మృతుల కుటుంబాలను శనివారం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపి ఆర్థిక సహాయాలు అందజేశారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్, మండల అధ్యక్షుడు ఈధులకంటి రవీందర్ రెడ్డి,వర్దన్నపేట మార్కెట్ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి,మాచర్ల ప్రభాకర్, ముద్రబోయిన వెంకటేశ్వర్లు,భూక్య సమ్మయ్య,ఎండీ అఫ్రోజ్,ఉళ్లేంగుల యాదగిరి,చిర్ర మల్లయ్య,ఉళ్లేంగుల నర్సయ్య, పెండ్లి మహేందర్ రెడ్డి,కాంచనపల్లి వనజరాణి, గుజే సుధాకర్, రాయిని యాకన్న,లునావత్ కిషన్,భూక్య పరమేష్, బొమ్మేర కళ్యాణ్, పిరని ప్రవీణ్, ఉబ్బని నవీన్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: సురేష్, రాయపర్తి, వరంగల్ జిల్లా