దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక
విజయవాడ మేజర్ న్యూస్ : దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయాల మహిళా చెస్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు కృష్ణా విశ్వవిద్యాలయ జట్టు ఎంపికైంది. జట్టు సభ్యుల వివరాలను సప్తగిరి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, టోర్నమెంట్ నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ ఆర్. రఘురాం ప్రకటించారు. హైదరాబాద్‌లోని వాక్సిన్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నవంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. కృష్ణా విశ్వవిద్యాలయ జట్టు సభ్యులుగా కే. హైందవి సర్వాణి (ఎస్‌వీడీ లా కళాశాల), జె. సాయి హర్షిత (కేబీఎన్ కళాశాల), జె. తిరుపతమ్మ (ఎస్‌డీఎంఎస్‌ఎం కళాశాల), ఎం. పల్లవి (కేవీఎస్‌ఆర్ సిద్ధార్థ ఫార్మాస్యూటికల్ కళాశాల) ఎంపికయ్యారు. జట్టు మేనేజర్, కోచ్‌గా డాక్టర్ ఆర్. రఘురాం వ్యవహరించనున్నారు. ఎంపికైన క్రీడాకారిణులకు కళాశాల క్రీడా కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.