కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం
పెనమలూరు మేజర్ న్యూస్ : కంకిపాడు జడ్పీటీసీగా విజయం సాధించిన కూటమి అభ్యర్థి దండమూడి పూజితను పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పోరంకిలోని నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కంకిపాడు మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అభినందనలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదమే విజయానికి పునాది అని, అభివృద్ధే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.