పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ
విజయవాడ సెంట్రల్, మేజర్ న్యూస్ : దీపావళి పండుగను పురస్కరించుకుని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 71వ డివిజన్ సత్యనారాయణపురంలో శనివారం సేవా కార్యక్రమం నిర్వహించారు. చారిత్రక బాబురావు మేడ యజమానులు రాజరమణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ ముఖ్య అతిథిగా హాజరై సుమారు 200 మంది పేదలకు దుప్పట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపే పండుగ అని అన్నారు. పేదలతో పండుగ ఆనందాన్ని పంచుకోవడం, ఆర్థికంగా వెనుకబడిన వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలతో పేదల జీవితాల్లో ఆనందం నింపవచ్చని, ఇలాంటి కార్యక్రమాలు మానవత్వం, సోదరభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. కార్యక్రమ నిర్వాహకురాలు రాజరమణిని అభినందించారు. ఈ కార్యక్రమంలో 71వ డివిజన్ కార్పొరేటర్ గార్లపాటి ఊర్మిళ, డివిజన్ పార్టీ ఇన్‌ఛార్జి గార్లపాటి విజయకుమార్, గుడిపాటి దత్తు, జె. రామలక్ష్మి, ఫణి తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.