BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

ఎమ్మెల్యేకు ఎస్సీ డిపార్ట్మెంట్ సన్మానం

Select Suryaa Now
ఎమ్మెల్యేకు ఎస్సీ డిపార్ట్మెంట్ సన్మానం

వెంకటాపురం నూగూరు,  మేజర్ న్యూస్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ నేతలు శనివారం క్యాంప్ ఆఫీస్‌లో ఘనంగా సన్మానించారు.
వైస్ చైర్మన్ ఎల్. వెంకట్ నరసయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గద్దల రమేష్, కో-ఆర్డినేటర్ కొండూరి కిరణ్ కుమార్, ములుగు జిల్లా వైస్ చైర్మన్ కోట నరేంద్ర తేజ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేస్తున్న ఘనత వెంకట్ నరసయ్యదే అన్నారు.వెంకట్ నరసయ్య మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేను భారీ మెజార్టీతో గెలిపిస్తామని, ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తం రెడ్డి గెలుపు కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. దళిత వాడల్లో ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వ పథకాలు అందాలని కోరారు.ఈ నెల 13న జరిగే నియోజకవర్గ స్థాయి మీటింగ్‌కు ముఖ్య అతిథిగా వస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ములుగు జిల్లా ఎస్సీ డిపార్ట్‌మెంట్ జనరల్ సెక్రటరీ కోగిల మోహన్, ప్రధాన కార్యదర్శి సల్లూరి సతీష్, భద్రాచలం అధ్యక్షులు తోకల ప్రసాద్, చర్ల మండల అధ్యక్షుడు మచ్చ రాజా, మహిళా అధ్యక్షులు సాధనపెల్లి భవాని, జనరల్ సెక్రెటరీ మండల సోనియా, వెంకటాపురం అధ్యక్షులు చిట్యాల సాగర్, వాజేడు మండల అధ్యక్షుడు మొలకల ప్రశాంత్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్; చక్రధర్, వెంకటాపూర్, ములుగు జిల్లా