BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

నేల ఆరోగ్యాన్ని బట్టి పంటలు సాగు చేయాలి

Select Suryaa Now
నేల ఆరోగ్యాన్ని బట్టి పంటలు సాగు చేయాలి

రాయపర్తి, మేజర్ న్యూస్, రైతులు నేల ఆరోగ్యాన్ని బట్టి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల అన్నారు.మండలంలోని మొరిపిరాల గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ పెదగోని నాగరాజు అధ్యక్షతన ‘ఖేత్ బచావో అభియాన్’లో   రైతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల పాల్గొని మాట్లాడుతూ రైతులు నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ సాగు ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. నేల పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలని, పంట మార్పిడి, మల్చింగ్, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించాలని,  ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని తెలిపారు. .రైతులు యాసంగి లో వరి పంట సాగు చేయొద్దు అని , వరి పంట కోసం ఎక్కువ నీళ్లు అవసరం కాబట్టి భూగర్భ జలాలు తగ్గి, తాగు నీరు దొరికన పరిస్థితి వచ్చే అవకాశం ఉందని, కావున తక్కువ నీళ్లు అవసరం ఉండే పంటలు సాగు చేసుకోవాలని,వరి కి బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు కూరకాయల పంట సాగు చేస్తూ అధిక లాభాలు పొందాలని కోరారు. పశువులకు అవసరమైన మేత అందుబాటుపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.ఈ కార్యక్రమంలో వర్దన్నపేట డివిజన్ వ్యవసాయ సంచాలకులు నర్సింగ,మండల వ్యవసాయ అధికారి గుమ్మడి వీరభద్రం,   వ్యవసాయ విస్తరణ అధికారి  క్రాంతి, ఉపసర్పంచ్ మహేంద్ర,రెవెన్యూ GPO సురేష్, పంచాయతీ కార్యదర్శి  సోమరాజు రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వర్దన్నపేట డివిజన్ వ్యవసాయ సంచాలకులు నర్సింగ,మండల వ్యవసాయ అధికారి గుమ్మడి వీరభద్రం,   వ్యవసాయ విస్తరణ అధికారి  క్రాంతి, ఉపసర్పంచ్ మహేంద్ర,రెవెన్యూ GPO సురేష్, పంచాయతీ కార్యదర్శి  సోమరాజు రైతులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్, సురేష్, రాయపర్తి ,వరంగల్ జిల్లా