రోడ్డు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం.. ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలసి పరామర్శించిన కట్టంగూర్ కాంగ్రెస్ నాయకులు!
ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కాన్వాయ్ రెండు రోజుల క్రితం స్వల్ప రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేతో పాటు కాన్వాయ్‌లో ఉన్న ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కట్టంగూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం నకిరేకల్ పన్నాలగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేముల వీరేశంని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, క్షేమంగా ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ పూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు రెడ్డిపల్లి వీరస్వామి, కట్టంగూర్ పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కాపుగొంటి నరేష్, నాయకులు కానుగు లింగయ్య, గూనల లింగయ్య, మేకల సాంబయ్య, కోలా బోలే షావలిబాబా, వీరమల్ల సురేష్, రెడ్డిపల్లి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.