BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

నడిగడ్డ తండా సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే గాంధీ

Select Suryaa Now
నడిగడ్డ తండా సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే  గాంధీ

మియాపూర్,మేజర్ న్యూస్ : మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే  ఆరెకపూడి గాంధీ  ఆధ్వర్యంలో శుక్రవారం  వివేకానంద నగర్ ఎమ్మెల్యే కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నడిగడ్డ తండాలో అసంపూర్తిగా ఉన్న రోడ్ల నిర్మాణం, యుజిడి  పైప్‌లైన్ పనులకు, మియాపూర్ మెట్రో పిల్లర్ నంబర్ 600 నుంచి మెట్రో స్టేషన్ వరకు నిలిచిపోయిన సర్వీస్ రోడ్డు నిర్మాణానికి సిఆర్పిఎఫ్  స్థలంలో అనుమతులు మంజూరు చేయాలని సిఆర్పిఎఫ్ సౌత్ సెక్టార్  ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్ రావును ఎమ్మెల్యే  గాంధీ కోరారు.సర్వీస్ రోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. నడిగడ్డ తండా లో దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి, అసంపూర్తి అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే  గాంధీ విజ్ఞప్తులపై  ఇన్‌స్పెక్టర్ సానుకూలంగా స్పందించారు.ఈ సమావేశంలో తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, CMC ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.