BREAKING
కోనసీమలో విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూం నంబర్లు విడుదల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం తెరుచుకోనున్న బ్యాలెట్ బాక్సులు.. నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనున్న వేళ.. గోపాలపురంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ మిసెస్ హైదరాబాద్ కిరీటం కైవసం చేసుకున్న పి.గన్నవరం యువతి రాజశ్రీ రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి విద్యాభివృద్ధికి వుండవిల్లి సేవలు చిరస్మరణీయం తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ నేతల సమావేశం విశాఖ కోర్టు సంచలన తీర్పు నేటి పంచాంగం 7 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –7 నవంబర్, 2026 కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష.. సూపర్వైజర్లతో ఆర్‌ఓ, ఎంపీడీఓ సమావేశం. కడియం కంచుకోటపై ఎవరి జెండా? బుచ్చయ్య చౌదరి అభివృద్ధి వ్యూహం ఫలించేనా? పెరవలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లో 71.77 శాతం పోలింగ్ నమోదు

కడియం కంచుకోటపై ఎవరి జెండా? బుచ్చయ్య చౌదరి అభివృద్ధి వ్యూహం ఫలించేనా?

Select Suryaa Now
కడియం కంచుకోటపై ఎవరి జెండా? బుచ్చయ్య చౌదరి అభివృద్ధి వ్యూహం ఫలించేనా?

                                          తాడాల చక్రవర్తి సేవలు భార్య రాజరాజేశ్వరికి విజయాన్ని అందించేనా?

కడియం, మేజర్ న్యూస్ :టీడీపీకి కంచుకోటగా పేరొందిన కడియం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. గత ఆరు ఎన్నికల్లో నాలుగుసార్లు టీడీపీ విజయం సాధించగా, ఈసారి కూడా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుందా? లేక వైఎస్సార్‌సీపీ బోణీ కొడుతుందా? అన్న ఉత్కంఠ నెలకొంది.
కూటమి అభ్యర్థి బోడపాటి పుణ్యవతి విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండలంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలాన్ని నమ్ముకుని ఆయన చేసిన ప్రయత్నాలు విజయాన్ని అందిస్తాయా? అన్నది చర్చనీయాంశంగా మారింది. మంత్రి కందుల దుర్గేష్ సైతం కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించి మద్దతు కూడగట్టారు.
మరోవైపు వైసీపీ అభ్యర్థి తాడాల రాజరాజేశ్వరి గెలుపు కోసం మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్, ఆకుల వీర్రాజు, చందన నాగేశ్వరరావు, వైయస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు తదితర నాయకులు ముమ్మర ప్రచారం చేశారు. ముఖ్యంగా ఆమె భర్త తాడాల విష్ణు చక్రవర్తి నిర్వహించిన సేవా కార్యక్రమాలు, ప్రజలతో ఉన్న అనుబంధం ఈ ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపాయన్న ఆసక్తి నెలకొంది. ఆయన సేవలకు ప్రజల ఆదరణ లభించి రాజరాజేశ్వరికి విజయాన్ని అందిస్తుందా? అన్నది మరో ప్రశ్నగా మారింది.
ఒకవైపు బుచ్చయ్య చౌదరి రాజకీయ వ్యూహం, అభివృద్ధి ప్రయత్నాలు.. మరోవైపు తాడాల చక్రవర్తి ప్రజాసేవ, వైసీపీ నాయకుల ప్రచారం.. ఈ రెండింటి మధ్య ఓటరు ఎవరికి పట్టం కట్టాడన్నది ఇప్పుడు మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.