BREAKING
కోనసీమలో విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూం నంబర్లు విడుదల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం తెరుచుకోనున్న బ్యాలెట్ బాక్సులు.. నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనున్న వేళ.. గోపాలపురంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ మిసెస్ హైదరాబాద్ కిరీటం కైవసం చేసుకున్న పి.గన్నవరం యువతి రాజశ్రీ రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి విద్యాభివృద్ధికి వుండవిల్లి సేవలు చిరస్మరణీయం తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ నేతల సమావేశం విశాఖ కోర్టు సంచలన తీర్పు నేటి పంచాంగం 7 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –7 నవంబర్, 2026 కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష.. సూపర్వైజర్లతో ఆర్‌ఓ, ఎంపీడీఓ సమావేశం. కడియం కంచుకోటపై ఎవరి జెండా? బుచ్చయ్య చౌదరి అభివృద్ధి వ్యూహం ఫలించేనా? పెరవలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లో 71.77 శాతం పోలింగ్ నమోదు

తెరుచుకోనున్న బ్యాలెట్ బాక్సులు.. నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనున్న వేళ..

Select Suryaa Now
తెరుచుకోనున్న బ్యాలెట్ బాక్సులు.. నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనున్న వేళ..

అనపర్తి, మేజర్ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గురువారం నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని అభ్యర్థుల భవితవ్యాన్ని బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ఆ బ్యాలెట్ బాక్సులు తెరుచుకోనున్న వేళ నేడు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అనపర్తి నియోజకవర్గంలో రాజకీయ వర్గాలతో పాటు అభ్యర్థులు, వారి అనుచరుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.నియోజకవర్గ పరిధిలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల గెలుపోటములపై గ్రామగ్రామాన చర్చలు సాగుతున్నాయి. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను ఎన్నికల అధికారులు పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూములకు తరలించి భద్రపరిచారు. 

ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత, కౌంటింగ్ సిబ్బంది నియామకం, ఇతర ఏర్పాట్లపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.మరోవైపు ఎన్నికల ప్రచార సమయంలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతలు తమ అభ్యర్థుల గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని అధికార కూటమి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తుండగా, పోటీలో ఉన్న స్థానాల్లో గణనీయమైన ఫలితాలు సాధించి తమ రాజకీయ పట్టును నిరూపించుకోవాలని ప్రతిపక్ష వైసీపీ నేతలు భావిస్తున్నారు.

ఈ ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గ్రామస్థాయిలో పార్టీ నాయకత్వం, అభ్యర్థుల వ్యక్తిగత పరిచయాలు, స్థానిక సమస్యలు, ఓటర్ల ఆదరణ వంటి అంశాలు ఫలితాల్లో ఎలాంటి ప్రభావం చూపనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి రౌండ్ల వారీగా వెలువడే ఫలితాలపై రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూడనున్నారు. ఎవరి అంచనాలు నిజమవుతాయి? ఏ పార్టీకి ప్రజల మద్దతు లభించింది? ఏ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేస్తారు? అన్న ప్రశ్నలకు నేడు సమాధానం లభించనుంది.