కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ నేతల సమావేశం
.అనపర్తి, మేజర్ న్యూస్ . జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో శుక్రవారం అనపర్తిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. శనివారం రాజానగరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో జరగనున్న కౌంటింగ్ ప్రక్రియపై ఈ సమావేశంలో చర్చించారు.ఈ సందర్భంగా కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఓటును జాగ్రత్తగా పరిశీలించాలని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ ప్రతిపక్ష నాయకులు సత్తి రామారెడ్డి, మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు), జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, టౌన్ అధ్యక్షులు నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి కొండేటి భీమేష్, మహేంద్ర, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు వల్లభశెట్టి రామ సతీష్, ఎంపీటీసీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు.