BREAKING
కోనసీమలో విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూం నంబర్లు విడుదల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం తెరుచుకోనున్న బ్యాలెట్ బాక్సులు.. నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనున్న వేళ.. గోపాలపురంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ మిసెస్ హైదరాబాద్ కిరీటం కైవసం చేసుకున్న పి.గన్నవరం యువతి రాజశ్రీ రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి విద్యాభివృద్ధికి వుండవిల్లి సేవలు చిరస్మరణీయం తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ నేతల సమావేశం విశాఖ కోర్టు సంచలన తీర్పు నేటి పంచాంగం 7 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –7 నవంబర్, 2026 కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష.. సూపర్వైజర్లతో ఆర్‌ఓ, ఎంపీడీఓ సమావేశం. కడియం కంచుకోటపై ఎవరి జెండా? బుచ్చయ్య చౌదరి అభివృద్ధి వ్యూహం ఫలించేనా? పెరవలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లో 71.77 శాతం పోలింగ్ నమోదు

రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి

Select Suryaa Now
రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి

రెండు స్ట్రాంగ్ రూములు, ఆరు కౌంటింగ్ గదుల కేటాయింపు :జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్
రామచంద్రపురం, మేజర్ న్యూస్ :రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.రామచంద్రపురం డివిజన్ పరిధిలోని రామచంద్రపురం, కె.గంగవరం మండలాలకు సంబంధించి మొత్తం 38 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్ల ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

రామచంద్రపురం మండలానికి సంబంధించి ఎస్.కె.పి.జి.ఎన్. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఐదవ గదిని స్ట్రాంగ్ రూముగా, ఆరో, ఏడో, ఎనిమిదో గదులను మూడు కౌంటింగ్ హాళ్లుగా కేటాయించినట్లు తెలిపారు. వీటిలో మొదటి కౌంటింగ్ హాల్‌కు 7 టేబుళ్లు, రెండవ కౌంటింగ్ హాల్‌కు 7 టేబుళ్లు, మూడవ కౌంటింగ్ హాల్‌కు 6 టేబుళ్లు కేటాయించారు.కె.గంగవరం మండలానికి సంబంధించి మొదటి గదిని స్ట్రాంగ్ రూముగా, రెండు, మూడు, నాలుగు గదులను కౌంటింగ్ హాళ్లుగా కేటాయించారు. వీటిలో మూడు కౌంటింగ్ హాళ్లకు వరుసగా 6, 6, 6 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు.రెండు మండలాలకు కలిపి మొత్తం రెండు స్ట్రాంగ్ రూములు, ఆరు కౌంటింగ్ గదులు, 38 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు.
బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఉన్న అధికారులు, సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లను మాత్రమే నిబంధనల ప్రకారం అనుమతించాలని సూచించారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అవసరమైన పోలీసు బలగాలను మోహరించాలని ఆదేశించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని, విజయోత్సవాలు, ఊరేగింపులు, బహిరంగ సమావేశాల నిర్వహణలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా పర్యవేక్షించాలన్నారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకత, నిష్పక్షపాత విధానాలను పాటిస్తూ ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.