కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
కె గంగవరం, మేజర్ న్యూస్ :మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల బ్యాలెట్ బాక్సులను గట్టి పోలీసు బందోబస్తు మధ్య అర్ధరాత్రి రామచంద్రపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తరలించి స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు.శనివారం జరిగే ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.మండలంలోని 58 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మూడు గదుల్లో 18 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో గదిలో ఆరు టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు.కౌంటింగ్ విధుల కోసం 20 మంది సూపర్‌వైజర్లు,60 మంది సిబ్బంది,ఆరుగురు డిజిటల్ అసిస్టెంట్లను నియమించారు.ఏర్పాట్లను ఏవో సురేంద్రరెడ్డి, ఎంఎస్‌జీ ఏసురత్నం పర్యవేక్షించారు.