BREAKING
కోనసీమలో విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూం నంబర్లు విడుదల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం తెరుచుకోనున్న బ్యాలెట్ బాక్సులు.. నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనున్న వేళ.. గోపాలపురంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ మిసెస్ హైదరాబాద్ కిరీటం కైవసం చేసుకున్న పి.గన్నవరం యువతి రాజశ్రీ రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి విద్యాభివృద్ధికి వుండవిల్లి సేవలు చిరస్మరణీయం తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ నేతల సమావేశం విశాఖ కోర్టు సంచలన తీర్పు నేటి పంచాంగం 7 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –7 నవంబర్, 2026 కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష.. సూపర్వైజర్లతో ఆర్‌ఓ, ఎంపీడీఓ సమావేశం. కడియం కంచుకోటపై ఎవరి జెండా? బుచ్చయ్య చౌదరి అభివృద్ధి వ్యూహం ఫలించేనా? పెరవలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లో 71.77 శాతం పోలింగ్ నమోదు

విద్యాభివృద్ధికి వుండవిల్లి సేవలు చిరస్మరణీయం

Select Suryaa Now
విద్యాభివృద్ధికి  వుండవిల్లి సేవలు చిరస్మరణీయం

రామచంద్రపురం, మేజర్ న్యూస్:విద్యాభివృద్ధికి, సమాజ శ్రేయస్సుకు వుండవిల్లి సత్యనారాయణమూర్తి చేసిన సేవలు చిరస్మరణీయమని కూటమి సీనియర్ నాయకులు, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. పట్టణంలోని వి .ఎస్.ఎం. కళాశాల వ్యవస్థాపకులు, విద్యాదాత,   వుండవిల్లి సత్యనారాయణమూర్తి 37వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం కళాశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి వాసంశెట్టి సత్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సత్యనారాయణమూర్తి విగ్రహానికి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ విద్య అనేది సమాజ అభివృద్ధికి పునాది అని గుర్తించి, ఎంతో దూరదృష్టితో విద్యాసంస్థను స్థాపించి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన మహనీయుడు వుండవిల్లి పుండవిల్లి సత్యనారాయణమూర్తి అని కొనియాడారు. విద్యారంగానికి ఆయన చేసిన కృషి, సమాజానికి అందించిన సేవలు భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వి.ఎస్.ఎం. కళాశాల ప్రెసిడెంట్, కరస్పాండెంట్  మెర్ల శివరామ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఎం ఎస్ ఎన్ మూర్తి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ కే బాలాజీ, ఎస్ ఎన్ అన్సారి, వైస్ ప్రిన్సిపల్  వి రవీంద్ర, ఏవో జి సత్యనారాయణ, సూపరిండెంట్ జి ఎస్ ఎన్ మూర్తి, పట్టణ టిడిపి అధ్యక్షులు  ఉండవెల్లి శివ, గరికపాటి సూర్యనారాయణ, మహేష్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొని వుండవిల్లి సత్యనారాయణమూర్తికి ఘనంగా నివాళులర్పించారు.