BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

బియ్యం అక్రమ నిల్వలు, తూకాల్లో మోసాలపై రాష్ట్రవ్యాప్త దాడులు

Select Suryaa Now
బియ్యం అక్రమ నిల్వలు, తూకాల్లో మోసాలపై రాష్ట్రవ్యాప్త దాడులు

హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి:  బియ్యం ధరల పెరుగుదలకు కృత్రిమ కొరత సృష్టిస్తూ, తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. అక్రమ నిల్వలు, అధిక ధరల విక్రయాలు, రేషన్ బియ్యం అక్రమ వ్యాపారంపై పౌరసరఫరాల శాఖ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించింది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 5 వరకు వారం రోజుల పాటు చేపట్టిన ఈ దాడుల్లో పలు అక్రమాలు వెలుగుచూడగా, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మొత్తం 55 కేసులు, 35 క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
పౌరసరఫరాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎం. స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్, తూనికలు-కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. బియ్యం మార్కెట్లో ధరల నియంత్రణకు అధికారులు గరిష్ఠ చిల్లర ధరలను నిర్ణయించారు. బీపీటీ, కేఎన్‌ఎం రకం బియ్యం కిలో రూ.66, ఆర్‌ఎన్‌ఆర్ (తెలంగాణ సోనా) రూ.74, హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్ రకం బియ్యం రూ.79కు మించి విక్రయించరాదని స్పష్టం చేశారు. ప్రతి 26 కిలోల బియ్యం బస్తాపై నిర్ణీత గరిష్ఠ ధరను ముద్రించాలని మిల్లర్లు, వ్యాపారులను ఆదేశించారు.
ఈ క్రమంలో బియ్యం మిల్లులు, టోకు, చిల్లర వ్యాపార సంస్థల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు 1,141 ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 55 కేసులు నమోదు చేశాయి. వీటిలో 35 క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరోవైపు తూనికలు, కొలతల శాఖ అధికారులు 1,545 తనిఖీలు చేపట్టి 280 కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో పలు రకాల మోసాలను అధికారులు గుర్తించారు. బస్తాలో 25 కిలోల బియ్యం ఉంచి, 26 కిలోలుగా ముద్రించి విక్రయించడం, అసలు ధరపై అధిక ధరల పట్టీలు అంటించడం, ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం వంటి ఉల్లంఘనలు వెలుగుచూశాయి. సరైన జీఎస్టీ, ఆహార భద్రత లైసెన్సులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారినీ గుర్తించారు. రేషన్ బియ్యాన్ని పదేపదే అక్రమంగా నిల్వ చేసే వారితో పాటు మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. అవసరమైతే నిర్బంధ చట్టం కింద చర్యలు చేపట్టడంతో పాటు నిత్యావసర వస్తువుల చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వినియోగదారులకు న్యాయమైన ధరలకు బియ్యం అందేలా రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.