BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

డివిజన్‌లో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఉప్పలపాటి శ్రీకాంత్

Select Suryaa Now
డివిజన్‌లో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఉప్పలపాటి శ్రీకాంత్

చందానగర్,మేజర్ న్యూస్ : మియాపూర్ డివిజన్ పరిధిలో వర్షాకాలంలో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే లక్ష్యంతో మయూరి నగర్‌లోని దివి రెసిడెన్సీ నుంచి శ్రీ దివ్యశ్రీ శక్తి వరకు, నడిగడ్డ తాండ నుంచి ఎస్ఎంఆర్ హైల్యాండ్ అపార్ట్‌మెంట్స్ వరకు నిర్మించనున్న రెండు ఆర్ సిసి  బాక్స్ డ్రైన్ల ప్రాంతాలను మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సీఎంసీ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల సమయంలో కాలనీలు, అపార్ట్‌మెంట్లలో నీరు నిలిచిపోకుండా శాస్త్రీయ పద్ధతిలో, తగిన సామర్థ్యంతో డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.ఎమ్మెల్యే  ఆరెకపూడి గాంధీ సహకారంతో   మియాపూర్ డివిజన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని శ్రీకాంత్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఎంసీ  అధికారులు ఏఈఈ  ప్రశాంత్, సిఆర్పిఎఫ్  అధికారి నాగేశ్వర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.