BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

ప్రభుత్వ భూములు ప్రజా అవసరాలకే వినియోగించాలి

Select Suryaa Now
 ప్రభుత్వ భూములు ప్రజా అవసరాలకే వినియోగించాలి

                                శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట యంసిపిఐ(యు) ధర్నా
గచ్చిబౌలి,మేజర్ న్యూస్ : మియాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 100 పరిధిలో ఉన్న ముజఫర్ అహ్మద్ నగర్, స్టాలిన్ నగర్ బస్తీల పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని, సర్వే నంబర్లు 100, 101లోని మిగులు ప్రభుత్వ భూమిని ప్రజా అవసరాలకు వినియోగించాలని యంసిపిఐ(యు) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్ మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా నివాసముంటున్న పేదలకు 68 గజాల స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. 550 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ప్రభుత్వ ఆసుపత్రి, కళాశాలలు, మినీ స్టేడియం, మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. భూముల విక్రయానికి ప్రయత్నిస్తే ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కుంభం సుకన్య, తాండ్ర కళావతి, వి. తుకారాం నాయక్, పి. భాగ్యమ్మ, కర్ర దానయ్య, ఇస్లావత్ దశరథ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.