వెంకన్న ఆలయం వద్ద పుష్కర పనులు పరిశీలించిన ఇంజనీరింగ్ అధికారులు
పెరవలి మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో జాతీయ రహదారి పక్కన పునర్నిర్మాణం జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించి మంజూరైన గోదావరి పుష్కర అభివృద్ధి పనులను నవంబర్ 6వ తేదీ శుక్రవారం దేవాదాయశాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ తోట దుర్గేష్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో చేపట్టిన పుష్కర పనుల పురోగతిని, నిర్మాణాల నాణ్యతను ఆయన పరిశీలించినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి మీసాల రాధాకృష్ణ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రాధాకృష్ణతోపాటు ఆలయ పాలకమండలి సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు