గిరిజనుల సబ్సిడీ పథకం నిధులు వెంటనే విడుదల చేయాలి
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ : గిరిజనుల టీ - ప్రైడ్, ఎమ్మెస్ఎంఈ ప్రోత్సాహక సబ్సిడీ పథకం నిధులు వెంటనే విడుదల చేయాలని నంగారా బేరి లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ కుమార్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు వెంకట్ బంజారా తో కలిసి ఆయన మాట్లాడారు. గత మూడేళ్లుగా ఈ పథకం నిర్వీర్యం అవుతుందని ఆవేదన చెందారు. ఎన్నికల సమయంలో కోటీశ్వరులను చేస్తామన్న వాగ్దానాలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని తెలిపారు. ఈ మూడేళ్లలో ఈ పథకానికి రూ.100 కోట్లు కూడా ఇవ్వలేదని తెలిపారు. బడ్జెట్లో సుమారు రూ 250 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఆచరణలో చేసిన ఖర్చు శూన్యమన్నారు. గత ప్రభుత్వ కాలము నుంచి నేటి వరకు దాదాపు రూ .1700 కోట్ల నిధులను పెండింగ్ లో పెట్టారని సూచించారు. గిరిజన ఎమ్మెల్యేలు, మంత్రులు జాతికి జరుగుతున్న అన్యాయాన్ని చట్టసభల్లో ప్రస్తావించాలని అన్నారు. లేకుంటే ఈ నెల 17న పరిశ్రమల కమిషనరేట్ కార్యాలయాన్ని రెండువేల మందితో మాట్లాడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు కోటియా నాయక్, రాష్ట్ర నాయకులు సుధాకర్ నాయక్, రాంబాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.