BREAKING
ఇంటి తాళం పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాల చోరీ రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలి - జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాదయాత్ర విజయోత్సవం.. సమీక్ష.. ఆత్మీయ సమ్మేళ్లనం..! -వేడుకలో పాల్గొన్న గీతా మూర్తి. భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే: తుది జట్టులోకి స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఎంట్రీ.. ఆ బౌలర్‌కు విశ్రాంతి? ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త. డాక్టర్ బండ సరోజన గారి సంస్మరణ సభ.. త్వరలో స్మారక సంచిక వేస్తాం -జ్వలిత ప్రకటన.. టిమ్ సైఫర్ట్ వికెట్ వెనుక అర్ష్‌దీప్, అన్షుల్ మాస్టర్ ప్లాన్: బౌలింగ్ వ్యూహం వెల్లడించిన గుర్నూర్ బ్రార్ గిరిజనుల సబ్సిడీ పథకం నిధులు వెంటనే విడుదల చేయాలి ఈ దీపావళికి ‘ఫీల్స్ లైక్ ఇనార్బిట్’ బ్రాండ్ క్యాంపెయిన్‌ - ఆవిష్కరించిన ఇనార్బిట్ మాల్స్ కంది వనంలోని స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీని మూసివేయాలి గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ పాండ్యా ట్రేడ్ చర్చలు: కెప్టెన్సీ ప్రతిపాదనపై ఆసక్తికర విశేషాలు ప్రభుత్వ శ్మశాన వాటికలలో ఉచిత ఖననం నిర్వహించాలి : మాజీ కార్పొరేటర్ శ్రవణ్ స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం ఖాయం ప్రపంచంలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఎక్స్‌పోకు హైదరాబాద్ వేదిక విచిత్రమైన నోబాల్ వివాదం: కీపర్ చేసిన చిన్న పొరపాటుకు బౌలర్‌కు శిక్ష.. రూల్స్ ఏం చెబుతున్నాయి? అసత్య ప్రచారాలను ఖండిస్తున్నాం .

కంది వనంలోని స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీని మూసివేయాలి

Select Suryaa Now
కంది వనంలోని స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీని మూసివేయాలి

హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ : అక్రమంగా నిర్మించిన ఓం శివశక్తి స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న వ్యర్ధాలతో నేల,నీరు, గాలి, వ్యవసాయ పంటలు కలుషితమై రోగాల బారిన పడుతున్నామని బాధితులు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఎల్కే రెడ్డి, సర్పంచ్ జెమినీ భాయ్ అమృనాయక్ లు పేర్కొన్నారు. గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ సర్పంచ్ అమృ నాయక్, రాకేష్ రెడ్డి, సర్పంచ్ కృష్ణయ్య, విజయలతో కలిసి వారు మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా, ఫరూక్ నగర్ మండలంలోనీ మొగిలిగిద్ద గ్రామపంచాయతీ శివారు భూముల్లో 2004లో ఓం శివశక్తి స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ నిర్మించారని తెలిపారు.

 ఈ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న వ్యర్ధాలతో కందివనం, పిట్టల గడ్డ తండా, గుండె నాయక్ తండ, దాస్య తండా, శిలుంబాయి తండా, సాలోను కోట తదితర ఊర్లు కాలుష్యం కోరల్లో చిక్కుకుపోయి అల్లాడుతున్నాయని అన్నారు. దీనిని మూసివేయాలంటూ 2014లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కేసు వేయగా నాలుగేళ్లు మూసేశారని తెలిపారు. అనంతరం ఓపెన్ చేయగా చెన్నైలోని గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించామని తెలిపారు. తీర్పు ప్రకారం కంపెనీని తేడాదిలో మూసేయాలని ఆర్డర్స్ వెలువడిన నేటికీ కార్యరూపం దాల్చలేదని ఆవేదన చెందారు. 

ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ కు ఐదేళ్లలో షిఫ్ట్ చేస్తామని చెప్పినట్లు తెలిపారు. దీనిపై కలెక్టర్, ఆర్డిఓను సైతం సంప్రదించినట్లు తెలిపారు. ఇటీవల తాము చేసిన నిరసనకు సుమారు రెండు రోజులు బందు చేసి మళ్లీ యధావిధిగా కార్యకలాపాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే మేల్కొని అక్రమ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీని మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర ప్రభుత్వ పెద్దలను కలవనున్నట్లు తెలిపారు. మూతపడనియెడల తాము గ్రామాలను వదిలి వలసలు బోయే ప్రమాదం ఏర్పడుతుందని వారు స్పష్టం చేశారు.