ప్రభుత్వ శ్మశాన వాటికలలో ఉచిత ఖననం నిర్వహించాలి : మాజీ కార్పొరేటర్ శ్రవణ్
మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : ప్రభుత్వ శ్మశాన వాటికలో ప్రతి పేద వ్యక్తికి గౌరవ ప్రదంగా దహన / ఖనన సంస్కారాలు చేప ట్టేలా చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిష నర్ వినయ కృష్ణారెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లా డుతూ, మల్కాజిగిరిలో ప్రతి ప్రభుత్వ శ్మశా న వాటిక వద్ద ధరల పట్టిక పెట్టాలని కోరారు. శ్మశాన వాటిక దగ్గర ఇచ్చేటువంటి దహన సర్టిఫికెట్ సైతం ఆన్ లైన్ చేయాలని, నూత న టెక్నాలజీ ద్వారా ఖననాలను, దహనాల ను మానిటర్ చేయాలని ఆయన సూచించా రు. తప్పుడు సర్టిఫికెట్లు జారీ కాకుండా పక డ్బందీ చర్యలు తీసుకోవాలని, వైకుంఠ దామాల అభివృద్ధికి తగిన నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా మల్కాజిగిరిలో ఉన్న చెరువులను శుద్ధి చేయడానికి, మురికి నీటిని నివారించ డానికి మరిన్ని విధులు విడుదల చేయాలని మరో వినతి పత్రాన్ని ఎంఎంసీ కమిషనర్ కు సమర్పించారు. దీనికి సానుకూలంగా స్పం దించిన కమిషనర్ వినయ్ రెడ్డి మాట్లాడు తూ, వీటిపై నేటి సమావేశంలో తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయ కులు ప్రభుగుప్తా, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.