పాదయాత్ర విజయోత్సవం.. సమీక్ష.. ఆత్మీయ సమ్మేళ్లనం..! -వేడుకలో పాల్గొన్న గీతా మూర్తి.
.ముషీరాబాద్ మేజర్ న్యూస్ :షామీర్ పేట్ మండలంలోని మునీరాబాద్ గ్రామo లో గల ఒక ఫంక్షన్ హాల్ లో బీజేపీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఎంపీ ఈటెల రాజేందర్ సారథ్యం లో 10 రోజుల క్రితం జరిగిన జవహర్ నగర్ డంపింగ్ యార్డు పాదయాత్ర విజయవంతం అయిన సందర్భంగా ఈ సమ్మేళనం నిర్వహించారు. ఈ సభ లో ఎo పి ఈటెల రాజేందర్ తో పాటు బీజేపీ నేతలు గిరి వర్ధన రెడ్డి, పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు గీతా మూర్తి, జిల్లా నాయకులు మల్లికార్జున, నవీన్, కార్యకర్తలు పాల్గొన్నారు. గీతా మూర్తి మాట్లాడుతూ ఈ డంపింగ్ యార్డు గురించి ఈటెల రాజేందర్ కష్ట పడి పాదయాత్ర చేపట్టి ప్రజలను ఏకం చేశారు అని చెప్పారు. ఆయనకు, పాదయాత్ర లో కీలకమైన బాధ్యత లు చేపట్టిన జిల్లా అధ్యక్షులు గిరి వర్ధన రెడ్డి, ఇతరుల కు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి డంపింగ్ యార్డు సమస్య గురించి పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు