ఈ దీపావళికి ‘ఫీల్స్ లైక్ ఇనార్బిట్’ బ్రాండ్ క్యాంపెయిన్ - ఆవిష్కరించిన ఇనార్బిట్ మాల్స్
తెలంగాణ బ్యూరో, ప్రతినిధి : గత 22 ఏళ్లకు పైగా ఇనార్బిట్ మాల్స్ ప్రజల జీవితాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కుటుంబ సభ్యులు కలిసి ఆనందంగా గడిపేందుకు, స్నేహితులు కలుసుకునేందుకు, ఎన్నో మధుర జ్ఞాపకాలను సృష్టించుకునేందుకు వేదికగా నిలుస్తోంది. పండుగ షాపింగ్, అనుకోకుండా వేసుకునే విహార ప్రణాళికలు, ఆత్మీయులతో కలిసి భోజనాలు, సినిమాలు చూడటం వంటి అనుభవాలు ఇనార్బిట్ మాల్స్ సందర్శనను మరింత ప్రత్యేకంగా మారుస్తున్నాయి.
ఈ సందర్భంగా ఇనార్బిట్ మాల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రజనీష్ మహాజన్ మాట్లాడుతూ, “ఇనార్బిట్ మాల్స్ ప్రయాణంలో ఈ సంవత్సరం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. మా మాల్స్ సంఖ్య నాలుగు నుంచి ఎనిమిదికి పెరిగింది. మరిన్ని కొత్త ప్రాజెక్టులు, విస్తరణ కార్యక్రమాలు ప్రణాళిక దశలో ఉన్నాయి. మేము ఎంతగా విస్తరించినప్పటికీ, మా ప్రయాణంలో ప్రధానమైనది మాల్స్‌ను సందర్శించే ప్రజలే. గత 22 ఏళ్లుగా మా మాల్స్ ఎన్నో కుటుంబ విహారాలు, వేడుకలు, సంప్రదాయాలు, రోజువారీ మధుర క్షణాల్లో భాగమయ్యాయి. ఈ అనుబంధాలను, ఒక ప్రదేశంతో మనకు ఏర్పడే ఆత్మీయ భావనను ప్రతిబింబించడమే ‘ఫీల్స్ లైక్ ఇనార్బిట్’ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం” అని తెలిపారు.
ఈ క్యాంపెయిన్ గురించి ఇనార్బిట్ మాల్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రోహిత్ గోపాలాని మాట్లాడుతూ, “ఇనార్బిట్‌లో అత్యుత్తమ అనుభవాలు కేవలం చూడటానికి లేదా వినడానికి మాత్రమే పరిమితం కావని, వాటిని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలని మేము విశ్వసిస్తున్నాం. పండుగ ప్రత్యేక వంటకాల సువాసనలు, కొత్త విషయాలను కనుగొనడంలో కలిగే ఆనందం, ఆత్మీయులతో కలిసి గడిపే మధుర క్షణాలు మన ఐదు ఇంద్రియాలను ఉత్తేజపరుస్తాయి.
ఈ అనుభూతులే ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా మారుస్తాయి. ‘ఫీల్స్ లైక్ ఇనార్బిట్’ క్యాంపెయిన్ ఈ భావోద్వేగాన్ని, ఒక అనుభవాన్ని నిజంగా ఆస్వాదించడంలోని అర్థాన్ని ప్రతిబింబిస్తుంది. తొలిసారిగా ఈ క్యాంపెయిన్ కోసం ప్రత్యేక గీతాన్ని కూడా పరిచయం చేస్తున్నాం. ప్రజలు ఈ అనుభూతితో మరింతగా అనుసంధానమయ్యేలా ఈ గీతానికి ప్రత్యేక స్వరాన్ని, మధురమైన సంగీతాన్ని అందించాం” అని వివరించారు.