BREAKING
మాకవరపాలెంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ. ఉదయం పూట ఓట్స్ తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? ఆరోగ్య నిపుణుల సలహాలు పుస్తక పఠనంతో విజ్ఞానం మీ సొంతం కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు. ఫారంపాండ్ పనుల పరిశీలన జలుమూరులో 66.51 శాతం ప్రశాంతంగా ముగిసిన పలాస ఎన్నికలు - 66.96 శాతం పోలింగ్. ఓటు వేయడానికి వచ్చిన లచ్చుమయ్య సంతబొమ్మాళిలో ప్రశాంతంగా పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్. ఓటు వినియోగించుకున్న బోయిన కౌంటింగ్ రోజున పలాసలో ట్రాఫిక్ ఆంక్షలు - ఆ మార్గంలో నో ఎంట్రీ. రంజీ ట్రోఫీలో చెలరేగిన మహమ్మద్ షమీ: 8 మెయిడిన్ ఓవర్లతో నాలుగు వికెట్లు పడగొట్టి సెలక్టర్లకు సవాల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుడిని ఆదుకోండి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

సంతబొమ్మాళిలో ప్రశాంతంగా పోలింగ్!

Select Suryaa Now
సంతబొమ్మాళిలో ప్రశాంతంగా పోలింగ్!

 

- మండలంలో 62.33 శాతం ఓటింగ్ నమోదు

- 74 పోలింగ్ కేంద్రాల్లో జడ్పీటీసీ, 20 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

- ఆకాశలక్కవరంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ

- సాయంత్రం 7 గంటల వరకు కొనసాగిన పోలింగ్

సంతబొమ్మాళి, నవంబర్ 5 (మేజర్ న్యూస్):

సంతబొమ్మాళి మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని 74 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ తొలుత మందకొడిగా సాగింది. మధ్యాహ్నం వరకు సుమారు 25 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైనప్పటికీ, ఆ తర్వాత ఓటర్లు క్రమంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో పోలింగ్ శాతం పెరిగింది. మండలంలో మొత్తం 60,562 మంది ఓటర్లకు గాను 37 వేలు పైగా మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 62.33 శాతం పోలింగ్ నమోదైంది. మండలంలో ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా ఏకగ్రీవం కాకపోవడంతో జడ్పీటీసీతో పాటు మొత్తం 20 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ప్రధానంగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ పడటంతో ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఒకటి రెండు చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది.

ఆకాశలక్కవరంలో స్వల్ప ఉద్రిక్తత:-

ఆకాశలక్కవరం పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న పాత్రికేయుల సెల్‌ఫోన్‌ను టీడీపీ నాయకులు లాక్కున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని పాత్రికేయులు నౌపడ ఎస్‌ఐ నారాయణమూర్తి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన లేదని పాత్రికేయులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

అభ్యర్థుల ఓటు హక్కు వినియోగం:-

టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థిని పుక్కళ్ల పద్మ తన స్వగ్రామమైన జగన్నాధపురంలో ఓటు హక్కు వినియోగించుకోగా, వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిని పాల లక్ష్మి కేసునాయుడుపేటలో ఓటు వేశారు. నౌపడ, సంతబొమ్మాళి పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత కూడా ఓటర్లు బారులు తీరడంతో ఎన్నికల నిబంధనల ప్రకారం రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఆకాశలక్కవరంలో స్వల్ప ఉద్రిక్తతలను మినహాయిస్తే మండలవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.