BREAKING
ఎనర్జీ డ్రింక్స్ అలసటను పోగొట్టే అమృతమా లేక అనారోగ్యాల నిలయమా: ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు మాడుగులలో ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్: 72 శాతం నమోదు వాయు కాలుష్యం బారి నుంచి ఊపిరితిత్తులను రక్షించే అద్భుతమైన ఆహారాలు ఇవే చెదురు మదురు ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతం మాకవరపాలెంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ. ఉదయం పూట ఓట్స్ తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? ఆరోగ్య నిపుణుల సలహాలు పుస్తక పఠనంతో విజ్ఞానం మీ సొంతం కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు. ఫారంపాండ్ పనుల పరిశీలన జలుమూరులో 66.51 శాతం ప్రశాంతంగా ముగిసిన పలాస ఎన్నికలు - 66.96 శాతం పోలింగ్. ఓటు వేయడానికి వచ్చిన లచ్చుమయ్య సంతబొమ్మాళిలో ప్రశాంతంగా పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్. ఓటు వినియోగించుకున్న బోయిన

ప్రశాంతంగా ముగిసిన పలాస ఎన్నికలు - 66.96 శాతం పోలింగ్.

Select Suryaa Now
ప్రశాంతంగా ముగిసిన పలాస ఎన్నికలు - 66.96 శాతం పోలింగ్.

నవ దంపతుల ఓటు హైలెట్ - టెక్కలిపట్నంలో ఏఎస్పీ తనిఖీ.

పలాస, నవంబర్ 5, మేజర్ న్యూస్.

పలాస మండలంలో గురువారం జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని 47 పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ సజావుగా జరిగింది.మండలంలో మొత్తం 35,212 ఓట్లు ఉండగా, 23,579 ఓట్లు పోలయ్యాయి. దీంతో 66.96 శాతం పోలింగ్ నమోదైంది.టెక్కలిపట్నం పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఏఎస్పీ శ్రీనివాసరావు సందర్శించి పరిశీలించారు. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా ఓటర్లు క్యూలో ఉండడంతో 25 మందికి టోకెన్లు ఇచ్చి ఓటు వేసే అవకాశం కల్పించారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు.

చినంచల, టెక్కలిపట్నం, పెదంచల తదితర సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. చాలా చోట్ల పోలీసులు లేకపోవడంతో మాజీ సైనికులు, ఇతర అధికారుల సహకారంతో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.మండలంలో చాలా చోట్ల ఓటర్ స్లిప్పులు సకాలంలో ఇవ్వకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు.

పెళ్లి మండపానికి ముందు ఓటు - నవ వధువు ఆదర్శం.

మాకన్నపల్లి పోలింగ్ కేంద్రంలో నవ యువ దంపతులు ఓటు వేయడం అందరినీ ఆకట్టుకుంది. పలాస మండలం మాకన్నపల్లి గ్రామానికి చెందిన కుత్తుం మాధవరావు (మాకన్నపల్లి ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి) కుమార్తె కుత్తుం మానసకు వజ్రపుకొత్తూరు మండలం పల్లిసారధిలో పెళ్లి జరుగుతుండగా, తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చి తన తండ్రి గెలవాలని ఓటు వేసి పెళ్లి మండపానికి వెళ్లారు. ఈ ఘటన ఓటు విలువను చాటి చెప్పింది.

స్ట్రాంగ్ రూంకు బ్యాలెట్ బాక్సులు.

ఎన్నికలు జరిగిన తర్వాత వివిధ పార్టీల ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను సీజ్ చేశారు. సీజ్ చేసిన బ్యాలెట్ బాక్సులను, ఎన్నికల అధికారులను ఐదు రూట్లలో గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఆర్టీసీ బస్సుల్లో పలాస జూనియర్ కళాశాల స్ట్రాంగ్ రూంకు తరలించారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలో పెట్టి పలాస ఆర్డీఓ ఆర్. అప్పలరాజు సమక్షంలో సీజ్ చేశారు.