చెదురు మదురు ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతం
రావికమతం నవంబర్ 5 మేజర్ న్యూస్ : ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి స్వల్ప ఘర్షణలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రావికమతం, మచ్చవానిపాలెం తదితర గ్రామాల్లో స్వల్ప వివాదాలు చోటుచేసుకున్నాయి. పి. పొన్నవోలు లో ఓటు వేసిన ఓటరు స్వస్తిక్ గుర్తు ఇంటికి పట్టికెళ్లడంతో పోలింగ్ ఆలస్యమైంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత క్యూలో ఉన్న 108 మంది కి టోకెన్లు ఇచ్చి పోలింగ్ పూర్తి చేశారు. రావికమతం, తోటకూర పాలెం, మేడివాడ టి. అర్జాపురం తదితర గ్రామాల్లో ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు, వృద్ధులు సహాయులతో వచ్చి ఓట్లు వేశారు. చీమలపాడు తోటకూర పాలెం తదితర గ్రామాలలో ఉదయం 10 గంటల తర్వాత పోలింగ్ జోరు అందుకుంది దీంతో ఓటర్లు పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరారు. పోలింగ్ బూత్ లకు మొబైల్ ఫోన్ అనుమతి లేదని ముందు నుంచి ప్రచారం చేసినప్పటికీ అక్కడక్కడ మొబైల్ ఫోన్ తో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మండలంలో 56003 ఓటర్లకు గాను 43 019 మంది ఓటు వేశారు. వీరిలో 20610 మంది పురుషులు కాగా,22408 మంది మహిళలు, ఇతరుల ఒకరు ఉన్నారు