కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు.
*కొత్తూరు పోలింగ్ కేంద్రం లో పోలీస్ లాఠి చార్జ్.
కొత్తూరు నవంబర్ 05(మేజర్ న్యూస్) కొత్తూరు మండలంలో పోలింగ్ ఉదయం ప్రశాంతం గా జరిగినా సాయంత్రం నాలుగు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల్లో కూటమి పార్టీ వర్గాల్లో చిన్న చిన్న ఘర్షణలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసాయి. ముఖ్యంగా కొత్తూరు పోలింగ్ కేంద్రంలో మాటా మాటా పెరిగి చివరకు కొట్లాటకు దారితీసింది. సకాలంలో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని లాఠి చేయడం తో ఆందోళన కారులు చెల్లాచెదురయ్యారు.పరిస్థితి అదుపులోనికి తీసుకొని వచ్చారు.అయితే కొత్తూరు 2 యంపిటిసి లో పోలింగ్ కొద్ది సేపు నిలిపి వేసి తిరిగి పోలింగ్ ప్రారంభించారు.ఓటింగ్ సమయం ముగిసినా క్యూ లైన్ వారికి టోకెన్లు ఇచ్చారు.ఆతరువాత పోలింగ్ పూర్తి చేశారు. మండలం పరిది లో గల 71పోలింగ్ స్టేషన్లలో 58 శాతం పోలింగ్ నమోదైంది.
మదనాపురం ,ఇరపాడు, కొత్తూరు, పారాపురం గ్రామాల్లో చిన్న చిన్న ఘర్షనలు తలెత్తాయి.