ఓటు వినియోగించుకున్న బోయిన
కోటబొమ్మాళి, నవంబరు 5, మేజర్ న్యూస్:
స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల్లో భాగంగా గురువారం నిర్వహించిన పోలింగ్‌లో రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోటబొమ్మాళిలోని పోలింగ్ కేంద్రంలో ఎలాంటి హడావుడి లేకుండా సాధారణ పౌరుడిలా క్యూలైన్‌లో నిలబడి ఆయన ఓటు వేసి ప్రజాస్వామ్య బాధ్యతను చాటుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పోలింగ్ అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో జరిగిందని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ దానిని బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేసేందుకు కొందరు నిర్లక్ష్యం చూపడం సరికాదని అభిప్రాయపడిన ఆయన, ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములై ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.