కౌంటింగ్ రోజున పలాసలో ట్రాఫిక్ ఆంక్షలు - ఆ మార్గంలో నో ఎంట్రీ.
మొగిలిపాడు - ఇందిరా చౌక్ మధ్య వాహనాలు బంద్ - షాపులు మూసివేత.
పలాస, నవంబర్ 5, మేజర్ న్యూస్.
పలాస ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద శనివారం జరగనున్న ఎంపీటీసీ / జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలాస-కాశీబుగ్గ పట్టణంలో కాశీబుగ్గ పోలీసు శాఖ కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీస్ శాఖ ఈ చర్యలు చేపట్టింది.ఈ విషయమై కాశీబుగ్గ డిఎస్పీ జివి రమణ మాట్లాడుతూ పలాస మొగిలిపాడు నుంచి ఇందిరా చౌక్ వరకు ఉన్న ప్రధాన రహదారిపై అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి..ఈ ఆంక్షలు 07.11.2026 ఉదయం 5.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు అమలులో ఉంటాయి.
షాపులు మూసివేయాలి:
మొగిలిపాడు నుంచి ఇందిరా చౌక్ వరకు మధ్యలో ఉన్న అన్ని వ్యాపార సముదాయాలు, షాపులు ఈ సమయంలో మూసి ఉంచుకోవాలని ఆదేశించారు.పలాస-కాశీబుగ్గ పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు, ప్రయాణికులు ఈ మార్గంలో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలి. అత్యవసర పనులపై వెళ్లే వారు ముందుగానే ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఆంక్షలు ఉన్న ప్రాంతాల్లో వాహనాలు నిలపడం, గుంపులుగా చేరడం, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం చేయరాదు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి సహకరించాలని కాశీబుగ్గ ఎస్ డిపీఓ విజ్ఞప్తి చేశారు.కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.