BREAKING
చెదురు మదురు ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతం మాకవరపాలెంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ. ఉదయం పూట ఓట్స్ తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? ఆరోగ్య నిపుణుల సలహాలు పుస్తక పఠనంతో విజ్ఞానం మీ సొంతం కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు. ఫారంపాండ్ పనుల పరిశీలన జలుమూరులో 66.51 శాతం ప్రశాంతంగా ముగిసిన పలాస ఎన్నికలు - 66.96 శాతం పోలింగ్. ఓటు వేయడానికి వచ్చిన లచ్చుమయ్య సంతబొమ్మాళిలో ప్రశాంతంగా పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్. ఓటు వినియోగించుకున్న బోయిన కౌంటింగ్ రోజున పలాసలో ట్రాఫిక్ ఆంక్షలు - ఆ మార్గంలో నో ఎంట్రీ. రంజీ ట్రోఫీలో చెలరేగిన మహమ్మద్ షమీ: 8 మెయిడిన్ ఓవర్లతో నాలుగు వికెట్లు పడగొట్టి సెలక్టర్లకు సవాల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుడిని ఆదుకోండి

క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుడిని ఆదుకోండి

Select Suryaa Now
క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుడిని ఆదుకోండి


- పదేళ్ల చిన్నారి సింగవరపు.రాజగోపాల్‌కు దాతలు అండగా నిలవాలి
- సమాజ సేవకుడు ఉర్లాం.శివతేజ.పట్నాయక్ విజ్ఞప్తి
శ్రీకాకుళం నవంబర్ 5 మేజర్ న్యూస్ :
పదేళ్ల వయసులోనే ఎముకల క్యాన్సర్‌ మహమ్మారితో పోరాడుతున్న చిన్నారి సింగవరపు.రాజగోపాల్‌ను ఆదుకోవాలని సమాజ సేవకుడు ఉర్లాం.శివతేజ.పట్నాయక్ పట్నాయక్ దాతలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, స్థానిక రాగోలు కూడలిలో నివాసముంటున్న పుణ్యవతి కుమారుడు రాజా గోపాల్ ఆడుతూ, పాడుతూ చదువుకోవాల్సిన వయసులో చిన్నారి క్యాన్సర్‌ వ్యాధి బారినపడి బాధపడుతుండటం మనసుని ఎంతో కలచివేస్తుందని, బాలుడికి మెరుగైన వైద్యం అందించేందుకు ఆర్థిక సహాయం అవసరమని తెలిపారు. మానవతా హృదయం కలిగిన దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సేవా భావం ఉన్నవారు స్పందించి తమకు చేతనైనంత ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ప్రతి ఒక్కరి చిన్నపాటి సహకారం బాలుడి వైద్యానికి ఎంతో ఉపయోగపడుతుందని, ఇప్పటి వరకు బాలునికి సుమారు 20 లక్షల రూపాయలు అప్పులు చేసి వెచ్చించారని, మెరుగైన చికిత్సకు సుమారు 5 కోట్లు వరకు అవసరమని విశాఖపట్టణం పినాకిని వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. చిన్నారి రాజగోపాల్‌కు అండగా నిలిచి అతడి ఆరోగ్యాన్ని తిరిగి చేకూర్చేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు రావాలని, కనీసం వైద్య ఖర్చులు కూడా పెట్టలేని స్థితిలో ఉన్నారని శివతేజ.పట్నాయక్ పట్నాయక్ తెలిపారు. సహాయం చేయాలనుకునేవారు, బాలుని తల్లి పుణ్యవతి చరవాణిని (90633 83181‬) సంప్రదించాలని, లేదా ఫోన్ పే ద్వారా సహకరించాలన్నారు.