జలుమూరులో 66.51 శాతం
* ప్రశాంతముగా ముగిసిన ఎన్నికలు
* అత్యధికముగా పోలింగ్ పాగోడు, పెద్దదుగాం నమోదు
జలుమూరు, నవంబర్ 5,( మేజర్ న్యూస్):
మండలంలోని ఎంపీటీసీ, జడ్పిటిసిల పోలింగ్ 66.51% ఓటర్లు తమ ఓటు హక్కును గురువారం వినియోగించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జయంతి ప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని మొత్తం ఓటర్లు51,692, ఇందులో పురుషులు 25827, మహిళలు 25774, ఆదర్శ్ 1. వీటిలో పోలింగ్ అయినా ఓటర్ల సంఖ్య 34,318 సాయంత్రము 5 గంటలకు అందిన సమాచారం మేరకు పోలింగ్ జరిగినట్లు66.51 శాతం అని తెలిపారు. మండలంలో ప్రథమ స్థానము అత్యధికముగా పోగోడులో తమ ఓటు హక్కును 75.19%, ద్వితీయ స్థానమును పెద్దదూగాo 72.54% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తర్వాత స్థానంలో అల్లాడ, అందవరం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుని పూర్తి బందోబస్తుతో నరసన్నపేట సిఐ శ్రీనివాసరావు, స్థానిక ఎస్సై బి అశోక్ బాబు సిబ్బంది విధులు నిర్వహించారు. జలుమూరులో ప్రశాంతముగా ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు ముగిసాయని తెలిపారు. పోలీస్ సిబ్బంది తక్కువగా ఉన్న ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా స్థానిక ఎస్సై బి అశోక్ బాబు విధి నిర్వహణలో చక్కగా నైపుణ్యంగా నిర్వహించారని పలువురన్నారు.