ఫారంపాండ్ పనుల పరిశీలన
నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని ఇప్పటూరు గ్రామపంచాయతీ పరిధిలోని చౌటపల్లిలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న ఫారంపాండ్ (వ్యవసాయ క్షేత్ర కుంటల) పనులను గురువారం ఎంపీడీవో జయరాం నాయక్,ఏపీవో జ్యోతిలుపరిశీలించారు.ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి,నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం నాణ్యతతో పనులు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.రైతులకు ఉపయోగపడేలా ఫారంపాండ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవికిరణ్,పంచాయతీ కార్యదర్శి నరేష్ గౌడ్,టీఏ,ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.