BREAKING
శివదీక్షతో ఆధ్యాత్మిక శోభ.. నకిరేకల్ రామలింగేశ్వరాలయంలో భక్తుల సందడి కార్తీకమాసం తొలిరోజే 100 మందికి పైగా శివమాల ధారణ.. 30 మంది కన్నె స్వాములు 88 రోజులుగా పార్లమెంట్ ప్రొరోగ్ కాలేదు: కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్ ఆపదలో ఉన్న కార్యకర్తకు ఎంవిఆర్ ఆర్థిక భరోసా ఇజ్రాయెల్‌లో కొత్త ప్రభుత్వం: ఐసెంకోట్‌కు రాష్ట్రపతి ఆహ్వానం బ్యాటరీ రేసులో భారత్: రూ.2,814 కోట్లతో రిఫైనరీల ఏర్పాటు 2027 యూపీ పోరులో యోగి, డిప్యూటీ సీఎంలు: బీజేపీ వ్యూహం L3 జాబితాతో ఇందిరమ్మ లబ్ధిదారులకు తిప్పలు! సర్వే తప్పిదాలతో అర్హులకు అన్యాయం.. కరువైన అధికారుల పర్యవేక్షణ! హుస్నాబాద్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. సొంత ఇల్లు లేని పలువురి పేర్లు సైతం సర్వేలో ఇల్లు ఉన్నట్లు నమోదు క తిరుమలలో శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు: సర్వదర్శనానికి 20 గంటల సమయం! మల్టిపుల్ స్క్లెరోసిస్‌తో పోరాడుతూ టూకీ స్మిత్ కన్నుమూత 'రామాయణ' కోసం దిగ్గజాల కలయిక: రెహమాన్, శ్రేయా ఘోషాల్‌లతో కుమార్ విశ్వాస్ పిక్స్ వైరల్! విషాదం: కరెంట్ వైరు పడి వ్యక్తి సజీవదహనం.. రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలి. : పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలి. : టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏ. రామచంద్రరెడ్డి. : 'రామాయణ'లో రణబీర్ కపూర్ నటనపై మహేష్ భట్ ప్రశంసలు ప్రముఖ మలయాళ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత తెలంగాణలో మొదలైన చలి పంజా: 14.7 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు!

మాడుగులలో ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్: 72 శాతం నమోదు

Select Suryaa Now
మాడుగులలో ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్: 72 శాతం నమోదు

 

మేజర్ న్యూస్ వి  మాడుగుల మండల పరిధిలో గురువారం జరిగిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తి ప్రశాంత వాతావరణంలో సజావుగా ముగిసింది. గత కొద్ది రోజులుగా మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గ్రామీణ ప్రజలు, మహిళలు విశేష ఆసక్తి కనబరిచారు.

ఓటరు స్లిప్పుల పంపిణీలో ఇబ్బందులు పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఓటరు స్లిప్పుల పంపిణీలో గందరగోళం నెలకొంది. ప్రధాన పార్టీల ప్రతినిధులు అన్ని ప్రాంతాలలో ఓటర్లకు స్లిప్పులను పూర్తిస్థాయిలో అందించకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ యంత్రాంగం, పలు పార్టీల కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తిరిగి అర్హులైన వారందరికీ సకాలంలో ఓటరు స్లిప్పులు చేరేలా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.మొత్తం సెగ్మెంట్లు: 21,మొత్తం ఓటర్ల సంఖ్య: 56,538,పోలైన ఓట్లు: 40,741 (సుమారు 72%)పురుషులు, మహిళలతో పాటు ఒక ట్రాన్స్‌జెండర్ ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.పోలింగ్‌కు దూరంగా ఉన్నవారు: 15,797 మందిమండలవ్యాప్తంగా 72 శాతం మేర భారీగా పోలింగ్ నమోదు కావడంపై అధికార యంత్రాంగం సంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా ఎన్నికలు విజయవంతంగా ముగియడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.