పీయులో ఇంటిగ్రేటెడ్ ఓరియంటేషన్ కార్యక్రమం
పాలమూరు యూనివర్సిటీ,మేజర్ న్యూస్ :- పాలమూరు యూనివర్సిటీ యూనివర్సిటీ పీజీ కళాశాల ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో నవంబర్ 6న ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ ,రిజిస్ట్రార్ పీ రమేష్ బాబు హాజరుకానున్నారు. కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను గురువారం పరిపాలన భవన్‌లో వీసీ విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. రమేష్ బాబు, ప్రొఫెసర్ ఎన్. చంద్రకిరణ్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి. మధుసూదన్ రెడ్డి, విభాగాధిపతి డాక్టర్ ఎస్. విజయలక్ష్మి, కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్. రవి కుమార్, అధ్యాపకులు డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, అయేషా హస్మి, డాక్టర్ సిద్ధరామ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కోర్సు కన్వీనర్ ప్రొఫెసర్ డి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, నవంబర్ 6న ఉదయం 10 గంటలకు పీజీ కళాశాల సెమినార్ హాల్‌లో కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి హాజరుకావాలని కోరారు. కోర్సు ప్రత్యేకతలు, ఉన్నత విద్య, పరిశోధన, ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు.
ఎం. ఓం ప్రకాష్ పాలమూరు యూనివర్సిటీ.మహబూబ్ నగర్ ,,